Telangana | హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): స్విట్జర్లాండ్లోని దావోస్లో తాజాగా ముగిసిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సు సందర్భంగా తెలంగాణకు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచినట్టు రేవంత్ సర్కారు చేసిన ప్రకటనలపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రకు ఏకంగా 16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటితో పోల్చి తే తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు 10% మత్రమేనని పలువురు విమర్శిస్తున్నారు. పైగా తెలంగాణలో పె ట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీల్లో సింహభాగం దేశీ య కంపెనీలే ఉన్నాయని, ముఖ్యం గా హైదరాబాద్కు చెందిన 3 కంపెనీలతోనే రేవంత్ ప్రభుత్వం 25 వేల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నదని గుర్తు చేస్తున్నారు.
అంతర్జాతీయ కంపెనీల్లో అత్యధికం మహారాష్ట్రకే క్యూ కట్టాయని, క్రాస్రెయిల్, బ్రూక్ ఫీల్డ్, బ్లాక్ స్టోన్, సుమిటోమో, బర్మింగ్హామ్ యూనివర్సిటీ లాంటి ప్రఖ్యాత సంస్థలు ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకే మొగ్గు చూపాయని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడులను రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరు డు దావోస్లో కుదుర్చుకున్న ఒ ప్పందాల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని, ఈ ఏడాది కుదిరిన ఒప్పందాలపై సంబరపడాల్సిన అవసరం లేదని కామెంట్లు చేస్తున్నారు.