Revanth Reddy | హైదరాబాద్, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ): మంత్రివర్గ సహచరులకు శాఖలను కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కీలకమైన శాఖలన్నీ తన వద్దనే ఉంచుకున్నారు. ఈ నెల 7న సీఎంతోపాటు 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే వారికి శాఖలను మాత్రం కేటాయించలేదు. శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఆధారంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం గెజిట్ నోటిఫికేషన్‌తోపాటు ఉత్తర్వులు కూడా జారీచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి హోం, పురపాలక, పట్టణాభివృద్ధితోపాటు సాధారణ పరిపాలన విభాగం, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. అదే విధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కీలకమైన ఆర్థికం, విద్యుత్తు శాఖలను కేటాయించారు. శాఖల కేటాయింపుపై అధిష్ఠానం తో సంప్రదింపులు జరిపేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ సీనియర్ నేతలతో సుదీర్ఘ మంతనాల తర్వాత ఎవరికి ఏ శాఖ కేటాయించాలనేది కొలిక్కి వచ్చింది. ఆ జాబితాపై శుక్రవారం రాత్రి రాజ్‌భవన్ ఆమో దం తీసుకున్నారు. అనంతరం శనివారం అధికారికంగా మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏ మంత్రికి ఏ శాఖ అనే ఉత్కంఠకు తెరపడినైట్లెంది.
శాఖల కేటాయింపులో భాగంగా పలు కీలక శాఖలను ముఖ్యమంత్రి తన వద్దనే ఉంచుకున్నారు. ముఖ్యంగా హోంశాఖ, విద్యాశాఖలను ఎవరికీ కేటాయించలేదు. పశుసంవర్ధక శాఖ, కార్మిక శాఖ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖ, కమర్షియల్ ట్యాక్స్, యువజన, క్రీడల శాఖలను కూడా శాఖల్ని ఎవరికీ కేటాయించలేదు.
రాష్ట్ర మంత్రివర్గంలో మరో ఆరుగురికి చోటు కల్పించే అవకాశం ఉన్నది. అయితే మంత్రివర్గం విస్తరణ ఎప్పుడు అన్నదానిపై పార్టీలో, ప్రభుత్వంలో ప్రధానంగా చర్చ జరుగుతున్నది. నిబంధనల ప్రకారం మంత్రివర్గంలో సీఎంతో పాటు మొత్తం 18 ఉండవచ్చు. అయితే ప్రస్తుతం 12 మంది మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మరో రెండు నెలల వరకు మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం లేదని తెలుస్తున్నది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు మంత్రివర్గ విస్తరణ చేపట్టి ప్రాతినిధ్యం లేని కొన్ని జిల్లాల వారికి స్థానం కల్పించే అవకాశమున్నట్టు సమాచారం. ఆ తరువాతనే లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని పార్టీ భావిస్తున్నట్టు తెలిసింది.
భట్టి విక్రమార్క ఆర్థికం, విద్యుత్తు
ఉత్తమ్ నీటిపారుదల శాఖ, సివిల్ సైప్లె.
రాజనర్సింహ వైద్య, ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ.
వెంకట్‌రెడ్డి రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ
శ్రీధర్‌బాబు ఐటీ, ఇండస్ట్రీ, అసెంబ్లీ వ్యవహారాలు
శ్రీనివాస్‌రెడ్డి రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ
పొన్నం ప్రభాకర్ రవాణా, బీసీ వెల్ఫేర్
కొండా సురేఖ అటవీ, దేవాదాయ శాఖ
సీతక్క పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమం
తుమ్మల వ్యవసాయ, చేనేత,కో-ఆపరేటివ్
జూపల్లి ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక