Kandhar BRS Public meeting | కంధార్లో జనజాతర.. మహారాష్ట్రలో రెండో బహిరంగ సభ విజయవంతం
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కంధార్ -లోహ పట్టణంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం నిర్వహించిన రెండో బహిరంగ సభ జనజాతరను తలపించింది. నాందేడ్ సభను మించి ఈ సభ దిగ్విజయవంతంగా కొనసాగింది. ఉదయం 9 గంటల నుంచే సభకు వెళ్లేందుకు గ్రామాల్లో సందడి నెలకొన్నది.
- నాందేడ్, పర్భణి, దెగ్లూర్, లాతూర్ నుంచి తరలిన ప్రజలు
- సద్దులు కట్టుకొని.. బైకులపై స్వచ్ఛందంగా కదిలివచ్చిన కర్షకులు
- కేసీఆర్ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూసిన మహారాష్ట్ర జనం
- ‘అబ్ కీ బార్..కిసాన్ సర్కార్’ అనే నినాదంతో మార్మోగిన బైల్ బజార్
- ప్రసంగం ఆద్యంతం జనం కేరింతలు
(కంధార్ – లోహా నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కంధార్ -లోహ పట్టణంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం నిర్వహించిన రెండో బహిరంగ సభ జనజాతరను తలపించింది. నాందేడ్ సభను మించి ఈ సభ దిగ్విజయవంతంగా కొనసాగింది. ఉదయం 9 గంటల నుంచే సభకు వెళ్లేందుకు గ్రామాల్లో సందడి నెలకొన్నది. రైతులు సద్దులు కట్టుకొని మరీ ద్విచక్ర వాహనాలపై సభకు కదిలిరాగా, ఆటోలు, బస్సుల్లో ప్రజలు భారీగా తరలివచ్చారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాలతో సభా ప్రాంగణంతోపాటు యావత్ లోహా తాలూకానే మార్మోగిపోయింది. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని సభికులు ఆద్యంతం ఆసక్తితో ఆలకించారు. ప్రసంగ సమయంలో కేసీఆర్ పంచులకు ప్రజలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ఈలలతో సభను హోరెత్తించారు.

కిక్కిరిసన బైల్ బజార్
బీఆర్ఎస్ బహిరంగ సభకు విదర్భ, మరఠ్వాడా ప్రాంతాలనుంచి జనం తరలిరాగా, లోహ పట్టణంలోని బైల్ బజార్ కిక్కిరిసిపోయింది. తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న నాందేడ్‌లో ఫిబ్రవరి 5న నిర్వహించిన తొలిసభకు మించి రెట్టింపు సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఒక్క లోహ పట్టణంలోనే దాదాపు 20 నుంచి 30 వేల జనాభా ఉండగా, అందులో యువకులు, స్థానికులు, వ్యాపారులతోపాటు దాదాపు అన్ని వర్గాల వారు సభకు కదిలివచ్చారు. దాదాపు సభకు 70 వేల మందికిపైగా జనం తరలివచ్చారు. లోహ పట్టణం గులాబీమయమైంది. ప్రధాన రహదారులన్నీ గులాబీ తోరణాలు, భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో కళకళలాడాయి.

కేసీఆర్ మాటలు వినేందుకు తరలిన గ్రామాలు
లోహలో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభపై మరాఠా పల్లెల్లో ఉదయం నుంచే సందడి నెలకొన్నది. పర్భణి, లాతూర్, నాందేడ్ లోకసభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఊరూరా సభపై చర్చ కొనసాగింది. కంధార్, లోహ, కన్నాడ్, పర్భణి, దెగ్లూర్, పూర్ణ, గంగాఖేడ్, ముద్ఖేడ్, పత్రి, పాలా, చందోలి, చౌక్, మన్వర్, అహ్మదాపూర్, ధర్మాబాద్, బిలోలి, పాలెం, మస్రా, సుభాశ్నగర్తోపాటు ఇతర నియోజకవర్గాలు, తాలూకాలకు గులాబీ నినాదం పాకింది. రైతులు, యువకులు ద్విచక్రవాహనాలకు బీఆర్ఎస్ జెండాలను కట్టుకొని ఒక్కొక్కరుగా సభకు తరలివచ్చారు. మహిళలు సైతం చంటిపిల్లలతో సభకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. చంద్రాపూర్, షోలాపూర్ నుంచి పలువురు నేతలు డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా సభకు చేరుకోవడం అందరినీ ఆకర్షించింది.
దేశ్ కా నేతా కైసా హో.. కేసీఆర్ జైసా హో
- జయహో కేసీఆర్.. జయహో భారత్ నినాదాలతో హోరెత్తించిన ప్రజలు
- సీఎం కేసీఆర్‌కు చప్పట్లతో ఘనస్వాగతం
నాందేడ్‌లోని కంధార్ లోహాలో నిర్వహించిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాలతో మార్మోగిపోయింది. లోహా సభా ప్రాంగణమే కాదు యావత్ తాలూకానే దద్దరిల్లిపోయింది.
కేసీఆర్ సభా వేదికకు చేరుకోగానే కర్షకులు, ప్రజలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. కూర్చున్న సీట్ల నుంచి పైకి లేచి వినమ్రపూర్వకంగా జేజేలు పలికారు. ‘దేశ్ కీ నేతా కైసా హో.. కేసీఆర్ జైసా హో’.. ‘కేసీఆర్ తుమ్ ఆగే బడో.. హమ్ తుమ్హారే సాథ్’..‘జయహో కేసీఆర్.. జయహో భారత్.. జై బీఆర్ఎస్’ నినాదాలతో కర్షకులు, కూలీలు హోరెత్తించారు. చప్పట్లతో ఘనస్వాగతం పలికారు. సభా ప్రాంగణం వద్ద బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ ప్రచార రథాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, కల్యాణలక్ష్మి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మరాఠీ భాషలో డిజిటల్ డిస్ ప్లే ద్వారా వీడియోలతో సహా వివరించగా, సభకు తరలివచ్చిన జనం ఆసక్తిగా తిలకించారు. తెలంగాణ పథకాలను తెలుసుకొని వేనోళ్ల ప్రశంసించారు. ఆ పథకాలు తమ రాష్ట్రంలోనూ అమలు జరుగాలని ఆకాంక్షించారు.
సైడ్ లైట్స్
- సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి నాందేడ్ ఎయిర్‌పోర్టుకు చేరుకొన్నారు.
- నాందేడ్ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 3 గంటలకు లోహా హెలిప్యాడ్‌కు
చేరుకొన్నారు. - హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో సభా వేదికకు బయలుదేరారు.
- సీఎం కేసీఆర్‌కు బీఆర్ఎస్ నాయకులు హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర దారిపొడవునా డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. గులాబీ పూల వర్షం కురిపించారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’.. ‘జయహో కేసీఆర్’ నినాదాలతో లోహా పట్టణ ప్రజలు దారిపొడవునా నీరాజనం పలికారు. సెల్ఫోన్లలో కేసీఆర్‌ను వీడియో తీసుకుంటూ మురిసిపోయారు. చేతులు ఊపుతూ, ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు.
- సీఎం కాన్వాయ్ మధ్యాహ్నం 3.20 గంటలకు సభా వేదికకు చేరుకొంది.
- అనంతరం సభా వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులు కేసీఆర్‌కు స్వాగతం పలికారు.
- సభా వేదికపై ఈ చివరి నుంచి ఆ చివరకు వెళ్తూ సభకు తరలివచ్చిన ప్రజలకు కేసీఆర్ అభివాదం చేశారు.
- సభా వేదికపై ఏర్పాటు చేసిన శివాజీ మహరాజ్, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, బసవేశ్వర్, అన్నా బావుసాఠే, జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
- అనంతరం సభా వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులకు అభివాదం చేశారు.
- సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పారు.
- మధ్యాహ్నం 3.34 గంటలకు సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
- సరిగ్గా 34 నిమిషాలపాటు ఏకధాటిగా ప్రసంగం కొనసాగింది.
- 4.10 గంటలకు కేసీఆర్ సభా ప్రాంగణం నుంచి లోహా హెలిప్యాడ్‌కు, అక్కడి నుంచి నాందేడ్ తిరుగుపయనమయ్యారు.
- బహిరంగ సభకు వచ్చిన వారు ఇబ్బందులు పడకుండా బీఆర్ఎస్ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు అందించారు.
- స్థానిక నేతలు తమ ప్రసంగాల్లో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని వివరిస్తున్నప్పుడు ప్రజలు చప్పట్లు కొట్టారు.
- తెలంగాణకే లోక్‌ప్రియ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణకే వికాస్‌కే నేత అంటూ తమ ప్రసంగాల్లో అంటున్నప్పుడు ప్రజలు ఈలలు వేశారు.
- వేదికపై స్థానిక కళాకారులు తమ పాటలతో అలరించారు.
- ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మహారాష్ట్ర పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

