హైదరాబాద్: ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు దసరా ఒక ప్రత్యేకమైన వేడుక అని కేసీఆర్ చెప్పారు. లక్ష్యసాధనలో విశ్రమించకూడదనేది దసరా ఇచ్చే స్ఫూర్తి అన్నారు. చెడుపై మంచి విజయానికి సంకేతమే విజయదశమి అని వివరించారు. ఈ దసరా సందర్భంగా అందరికీ ఆరోగ్యం, సిరిసంపదలు కలగాలని ఆయన ప్రార్థించారు.