గిరిజన చైతన్యం శిబు సొరేన్
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.. మానవ చరిత్ర మొత్తాన్ని ఈ ఒక్క మాటలో చెప్పేశారు మహాకవి శ్రీశ్రీ. అనాది నుంచి బలవంతుల అణచివేతకు, బలహీనుల మనగడకు మధ్య పోరాటం సాగుతూనే ఉన్నది. 22 ఏండ్ల క్రితం వరకు బీహార్‌లో కూడా ఇలాంటి పోరాటమే జరిగింది. భూస్వాములు, వడ్డీ వ్యాపారుల దోపిడీపై అమాయక గిరిజనులు పెద్ద ఎత్తున ఉద్యమించారు.
- భూస్వాములపై ఎక్కుపెట్టిన గిరిజన బాణం.. అణచివేతపై చిన్నవయసులోనే తిరుగుబాటు
- ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యాన్ని విడువని నేత.. జార్ఖండ్ రాష్ట్రం సాధించి గిరిజనులకు స్వేచ్ఛ
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.. మానవ చరిత్ర మొత్తాన్ని ఈ ఒక్క మాటలో చెప్పేశారు మహాకవి శ్రీశ్రీ. అనాది నుంచి బలవంతుల అణచివేతకు, బలహీనుల మనగడకు మధ్య పోరాటం సాగుతూనే ఉన్నది. 22 ఏండ్ల క్రితం వరకు బీహార్‌లో కూడా ఇలాంటి పోరాటమే జరిగింది. భూస్వాములు, వడ్డీ వ్యాపారుల దోపిడీపై అమాయక గిరిజనులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆ ఉద్యమానికి ఆద్యుడు ఓ 18 ఏండ్ల సంతాల్ గిరిజన యువకుడు.. అతడే శిబు సొరేన్. బీహార్ భూస్వాములు, దోపిడీదారులు, వలసవాదుల నుంచి గిరిపుత్రులకు సొంత రాష్ర్టాన్ని, స్వయం పాలనను సాధించిపెట్టిన నాయకుడు. మహామహా ఉద్ధండ పిండాల్లాంటి రాజకీయ నాయకులు కూడా దిగొచ్చి జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు స్వయంగా అంగీకరించేలా చేసిన గొప్ప చతురత కలిగిన నాయకుడు శిబు సొరేన్. జార్ఖండ్లోలాంటి అణచివేత, అన్యాయాలపై తిరగబడి పోరాడిన తెలంగాణకు సొరేన్ అన్నివేళలా మద్దతుగా నిలిచారు. కే చంద్రశేఖర్‌రావు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న సమయంలో అనేకసార్లు ఆయన తెలంగాణకు వచ్చి సభల్లో పాల్గొన్నారు.
జీవితమే ఓ పోరాటం
జార్ఖండ్‌లోని సారవంతమైన గిరిజనుల భూములన్నీ బీహార్ మైదానప్రాంతం నుంచి వచ్చిన భూస్వాములు, వడ్డీ వ్యాపారులు ఆక్రమించి దోపిడీకి పాల్పడుతుండటంతో చిన్నతనంలోనే శిబు సొరేన్ తిరుగుబాటు చేశారు. 18 ఏండ్ల వయసులో సంతాల్ నవయువక్ సంఘ్ అనే సంస్థను స్థాపించారు. 1972లో బెంగాల్ కమ్యూనిస్టు నాయకులు ఏకే రాయ్, కుర్మి మహతో నాయకుడు బినోద్ బిహారీ మహతో కలిసి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీని స్థాపించారు. గిరిజనుల హక్కుల కోసం ఎడతెగని పోరాటం చేశారు. ఈ క్రమంలో అనేక కేసులు కూడా ఎదుర్కొన్నారు. అయినా ఆయన లక్ష్యం సాధించేవరకు వెనుదిరగలేదు. స్వరాష్ర్టాన్ని సాధించి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
తెలంగాణకు తొలి మద్దతు శిబుదే
జార్ఖండ్లోలాంటి అణచివేత, అన్యాయాలపై తిరగబడి పోరాడిన తెలంగాణకు శిబు సొరేన్ అన్నివేళలా మద్దతుగా నిలిచారు. కే చంద్రశేఖర్‌రావు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న సమయంలో అనేకసార్లు తెలంగాణకు వచ్చి సభల్లో పాల్గొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

