హైదరాబాద్ ;హైదరాబాద్‌లో ఓ చిన్న ఫ్లైవోవర్ కడితే.. దాన్ని ఫొటో కొట్టి ఉత్తరప్రదేశ్‌లో కట్టినమని పెట్టుకుంటరు. తెలిసిన పిల్లలు కొందరు అలాంటివి బయటపెడుతున్నా సిగ్గులేదు. వేరే దేశంలో జరిగేది తీసుకువచ్చి లక్నోలో చేసినం అంటరు. 140 కోట్ల మందికి ప్రాతినిథ్యం వహించే ప్రధాని రోడ్డు మీద విమానం దిగి నేను సిపాయిని అని చెబుతడా? ఈ ట్రిక్కులా దేశాన్ని నడిపేది? గుజరాత్లో నీళ్లలో ఫ్లైట్ దిగి నేను ఏదో పీకి పడగొట్టిన అని చెబుతాడా? నీళ్లలో ఫ్లైట్ నడవబట్టి 70 ఏండ్లు అయ్యే. మాల్దీవ్స్ పోతే 50 ఏండ్ల నుంచి నీళ్లలో ఫ్లైట్ తిప్పుతున్నరు. బెంగాల్లో ఎలక్షన్లు వస్తే గడ్డం పెంచుకొని రవీంద్రనాథ్ ఠాగూర్‌లా కనిపించాలే! తమిళనాడులో ఎలక్షన్ వస్తే లుంగీ కట్టుకోవాలే! ఈ ట్రిక్కుల మీద దేశానికి కరెంట్ వస్తదా? పంజాబ్ ఎలక్షన్ ఉండె. సర్దార్జీలా పగిడ కట్టాలే. మణిపూర్ ఎలక్షన్ ఉండె. అక్కడి టోపీ పెట్టాలే. ఉత్తరాఖండ్‌లో ఉండే ఉత్తరాఖండ్ టోపీ పెట్టాలి. ఇన్ని టోపీలా? బుందేల్‌ఖండ్‌లో ఇప్పుడు ఎన్నికలు రాగానే కెన్బెట్వా ప్రాజెక్ట్ గుర్తుకు వచ్చిందా? ఇది ఎన్నికల స్టంట్ కాదా? ప్రెస్మీట్లో సీఎం కేసీఆర్