Telangana Cabinet | హైదరాబాద్ : ఈ నెల 18వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణ సచివాలయంలో ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కొత్త సచివాలయంలో తొలి కేబినెట్ సమావేశం ఇదే. ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.