హైదరాబాద్ : ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం కానుంది. రేపటితో లాక్డౌన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్పై కేబినెట్ తదుపరి నిర్ణయం తీసుకోనుంది. దీంతో పాటు సీజనల్ వ్యాధులు, తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. వర్షపాతం, వానాకాలం సాగు, సాగు సంబంధిత అంశాలు, గోదావరిలో నీటి ఎత్తిపోత, జల విద్యుత్ ఉత్పత్తిపై కూడా చర్చించనున్నారు.
సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన, శనివారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ కానున్నది. ఈ సందర్భంగా రాష్ట్రంలో లాక్ డౌన్, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తి తదితర అంశాలపై చర్చించనున్నది.
— Telangana CMO (@TelanganaCMO) June 18, 2021