Telangana Cabinet | రేపు లేదా 4న మంత్రివర్గ విస్తరణ.. పీసీసీ అధ్యక్షుడి ప్రకటన కూడా
పీసీసీకి కొత్త అధినేత నియామకం, మంత్రివర్గ విస్తరణ జూలై మొదటి వారంలోనే ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
- ముహూర్తం ఖరారైనట్టు ప్రచారం
Telangana Cabinet | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): పీసీసీకి కొత్త అధినేత నియామకం, మంత్రివర్గ విస్తరణ జూలై మొదటి వారంలోనే ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రెండు అంశాలపై పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ ఇతర ముఖ్యనేతలతో అధిష్ఠానం ఇప్పటికే చర్చించి నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో జూలై మొదటి వారంలోనే పీసీసీ కొత్త అధ్యక్షుడితోపాటు మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
జూలై 2 లేక 4వ తేదీన మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నదని ఈ వర్గాలు కచ్చితంగా చెప్తున్నాయి. ఈ రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉండటంతో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కొత్త అధ్యక్షుని ప్రకటన ఉండవచ్చని అంటున్నారు. జూలై 2వ తేదీ ఏకాదశి మంచి ముహూర్తమే అయినప్పటికీ ఆ రోజు మంగళవారం కావడంతో దీని కంటే 4వ తేదీన త్రయోదశి, గురువారం ఇంకా బాగుంటుందనే అభిప్రాయం వ్యకమైనట్టు సమాచారం. జూలై 6 నుంచి ఆషాడ మాసం ప్రారంభం కానుండటంతో ఆ లోగానే మంత్రివర్గ విస్తరణ జరగాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

