నేరడిగొండ, జూన్ 24: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కొర్టికల్ బీ గ్రామం వద్ద జాతీయ ర హదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్కు స్వల్ప గాయాలయ్యా యి. శనివారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు బయలుదేరారు.
మార్గమధ్యంలో నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలిసి వెళ్తుండగా, ఆవు రోడ్డు దాటుతూ వాహనానికి అడ్డు వచ్చింది. వాహనాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించినా, ఆవును ఢీకొనడంతో ఎమ్మెల్యే చేతికి గాయాలయ్యాయి. స్థానికులు వేరే వాహనంలో బోథ్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.