హైదరాబాద్, జూన్ 1(నమస్తేతెలంగాణ): తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ వేడుకలను నేడు ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం హైదరాబాద్లోని తెలంగాణ భవన్ ముస్తాబైంది. గులాబీ రంగు తోరణాలతో కళకళలాడుతున్నది. కార్యాలయ ప్రధాన ద్వారంతో పాటు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తల్లి విగ్రహాలను పూలతో అలంకరించారు.
మంగళవారం ఉదయం 9:30 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం గ్రామీణ కళాకారులను ఘనంగా సత్కరించనున్నారు.