హైదరాబాద్, జూన్20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు గురువారం తిరువనంతపురంలో కేరళ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ శశిధరన్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కులగణన కోసం పాటించాల్సిన విధివిధానాలు, కులగణన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల మార్గదర్శకాలపై చర్చించారు.
అధ్యయనాల నివేదికలను కేరళ కమిషన్ నుంచి సేకరించారు. తెలంగాణ బీసీ కమిషన్ ప్రస్తుత కార్యాచరణ ప్రణాళికను, కుల సర్వే వివరాలను కేరళ చైర్మన్‌కు వకుళాభరణం వివరించారు. కమిషన్ సభ్యుడు డాక్టర్ ఏవీ జార్జ్ పాల్గొన్నారు.