Boiled Rice | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వాన్ని బియ్యం కోరుతున్న రాష్ర్టాల జాబితాలో తమిళనాడు చేరింది. తమ రాష్ర్టానికి సుమారు 7 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కావాలంటూ తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు లేఖ రాసింది. గతంలో మన పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రం కూడా తమకు బియ్యం కావాలంటూ గతంలో రాష్ర్టాన్ని కోరింది.
రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరుగుదలతో వివిధ రాష్ర్టాలు ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ధాన్యం నిల్వలు అధికం కావడంతో మిల్లులను ఖాళీ చేయడానికి రా ష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ధాన్యాన్ని వేలం వేసిం ది. ఇలాంటి పరిస్థితుల్లో తమకు ఉప్పుడు బియ్యం కావాలని తమిళనాడు కోరడం గమనార్హం. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది.