హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ సిబ్బంది సైఫాబాద్ ఠా ణాలో ఫిర్యాదు చేశారు.
మంత్రి సీతక్క అసెంబ్లీలో మాట్లాడుతున్న సమయంలో తీసిన వీడియోను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా తయారు చేసి సోషల్‌మీడియాలో సర్క్యులేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వచ్చిన ఫిర్యాదుపై సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదుచేశారు. స్పీకర్‌పై పోస్టు చేసింది వికారాబాద్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.