హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శుక్రవారం తిరిగి ప్రారంభం కానున్నాయి.
సెప్టెంబర్ 24న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే గులాబ్ తుఫాను దృష్ట్యా మూడు రోజులపాటు వాయిదా పడిన అసెంబ్లీ నేడు పునఃప్రారంభం కానుంది.
నేడు హరితహారంపై శాసన సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. అదేవిధంగా పరిశ్రమలు, ఐటీ రంగం పురోగతిపై మండలిలో చర్చించనున్నారు. పర్యాటకులు, ప్రయాణికులకు వేధింపులు, మోసాలు నిరోధించేలా రూపొందించిన కొత్త చట్టం టౌటింగ్ బిల్లు, జీఎస్టీ చట్టసవరణ బిల్లును ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. గృహనిర్మాణ సంస్థ, ఉద్యానవన వర్సిటీ చట్టసవరణ బిల్లుపై, నల్సార్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై అసెంబ్లీలో చర్చ జరగనుంది.
వాయిదాపడిన అంశాలను, బిల్లులను, చర్చను తిరిగి ఎప్పుడు చేపట్టాలనేది స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్ణయించనున్నారు.