Telangana Assembly | హైదరాబాద్ : ఈ నెల 13వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 10న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 11న సెలవు ప్రకటించారు. 12, 13 తేదీల్లో బడ్జెట్‌పై చర్చించనున్నారు. అనంతరం అసెంబ్లీని వాయిదా వేయనున్నారు.
స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. అయితే కేసీఆర్‌కు బదులుగా హరీశ్‌రావు బీఏసీ సమావేశానికి వెళ్లారు. తన బదులుగా హరీశ్‌రావు బీఏసీకి వస్తారని కేసీఆర్ ముందే సమాచారం ఇచ్చారు. బీఏసీకి హరీశ్‌రావు రావడంపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఏసీ ప్రారంభమైన కాసేపటికే హరీశ్‌రావు బయటకు వచ్చారు.