Assembly Sessions | హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఎన్ని రోజులు సభ నిర్వహించాలో సోమవారం జరుగనున్న బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా నూతన ఆర్వోఆర్ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. కొత్తగా గ్రామ రెవెన్యూ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ బిల్లుపైనే ఉన్నది. దీంతోపాటు తెలంగాణ వైద్యవిధాన పరిషత్తును ప్రభుత్వంలో విలీనం చేసి సెకండరీ హెల్త్ డైరెక్టరేట్‌గా మార్చే బిల్లును సైతం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు వైద్యవర్గాలు తెలిపాయి. సమావేశాల ఏర్పాట్లపై ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీస్ శాఖతో అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సమీక్షించారు.
ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకరించాలని కోరారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని సూచించారు. కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రొటోకాల్ విషయంలో వివాదాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, సీఎస్ శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, రవిగుప్తా, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, జీఏడీ కార్యదర్శి రఘనందన్‌రావు, డీజీపీ జితేందర్, ఏడీజీ మహేశ్ భగవత్ తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు చర్చకు వచ్చే అంశాలు