హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శాసనసభను ప్రారంభించారు. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి నేరుగా బడ్జెట్‌పై చర్చ చేపట్టారు. సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 2022–23 ఆర్థిక సంవత్సరానికి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. శాసనసభా సమావేశాలు ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగనున్నాయి.