Telangana Assembly | హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు (Assembly Session) ఉదయం 10.30 గంటలకు ప్రారంభం అయ్యాయి. శాసనసభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన శాసనసభ్యులు, మాజీ సభ్యులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టి, నివాళులర్పించారు. ఇటీవల మృతిచెందిన జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సభ సంతాపం వ్యక్తం చేసింది సభ. మరోవైపు, శాసనమండలిలోనూ ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్సీలు డాక్టర్ టి రత్నాకర్, ఎం రంగారెడ్డి మృతి పట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.