TG Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాసనసభలో ప్రసంగిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని గవర్నర్ తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కాగా, ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై వాడీవేడీ చర్చ జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం నాడు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలు వెలుగులోకి తెచ్చి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి గొంతుకగా ఉభయసభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కేసీఆర్ ఉద్బోధించారు.