TG Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు హాట్‌హాట్‌గా మొదలయ్యాయి. సభ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పులు, అవినీతి, అక్రమాల్లో నెంబర్ వన్‌గా ఉంటే.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో వ్యవసాయంలో నెంబర్ వన్‌గా ఉన్నామన్నారు. రైతుల సంక్షేమంలో, ఉద్యోగ నియామకాలు, పరిశ్రమల పెట్టుబడుల్లో నెంబర్వగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళ్తుందంటూ ప్రభుత్వ పథకాలపై వివరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ మనస్ఫూర్తిగా ప్రసంగాన్ని చదివి ఉండరన్నారన్నారు.
15 నెలల పాలననను కేవలం 15 నిమిషాల్లో చదివేశారన్నారు. రైతులకు రుణమాఫీ చేశారా? మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశారా? రైతు కూలీలకు రూ.12వేలు ఇచ్చారా? అధికారం కోసం లక్షల అబద్ధాలు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీశ్‌రెడ్డి మాట్లాడుతుండగానే ఆది శ్రీనివాస్, మంత్రి కోమటిరెడ్డి అడ్డు తగిలారు. దాంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కల్పించుకొని మాట్లాడారు. సభ్యుడు మాట్లాడకుండా మంత్రులు అడ్డు తగులుతున్నారన్నారు. నువ్వెంత.. నేనేంత అంటే సభ నడుస్తుందా? అని ప్రశ్నించారు. ఆ స్పీకర్ గడ్డం ప్రసాదం కల్పించుకొని ప్రతిపక్షాలు గవర్నర్ ప్రసంగంపైనే మాట్లాడాలని సూచించారు.
అధికార పక్షం డీవియేషన్ కాకుండా ఉండేందుకు గవర్నర్ ప్రసంగంపైనే మాట్లాడాలన్నారు. ఈ తర్వాత జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను గవర్నర్ ప్రసంగంపైనే మాట్లాడాలని.. అధికారంపై పక్షం నుంచి మంత్రి ఏం మాట్లాడారో.. రాష్ట్రమంతా చూస్తుందని.. ఆయన మాట్లాడిన మాటాలకు.. గవర్నర్ ప్రసంగానికి సంబంధం ఉందా? అని ప్రశ్నించారు. దానిపై తేల్చాలని.. సభలో ఉండమంటే ఉంటా? లేకపోతో పోతానన్నారు. సభలో జరుగుతుందని రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారన్నారు. స్పీకర్ వ్యాఖ్యలపై స్పందించనన్నారు. అనంతరం స్పీకర్ జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. అసహనానికి గురవొద్దని.. సహనంతో ఉండాలన్నారు.
సభాసంప్రదాయాలను కాపాడాలన్నారు. పదేళ్లు మంత్రిగా ఉన్నారన్నారు. సభా సంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. దీనికి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ఏం విరుద్ధంగా మాట్లాడాలో చెప్పాలన్నారు. ఈ సభ అందరిదీ. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మా అందరి తరఫున పెద్ద మనిషిగా, స్పీకర్‌గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు’ అంటూ జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
దీనికి అధికారపై పక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. జగదీశ్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత హరీశ్‌రావు మాట్లాడుతూ శ్రీధర్‌బాబు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జగదీశ్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారని ప్రశ్నించారు. సభలో అందరు సభ్యులకు సమాన హక్కులు ఉంటాయన్నారు. శాసనసభ అంటే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వానికి సంబంధించినది కాదు.. ప్రతిపక్ష శాసనసభ్యులకు సమాన హక్కు ఉంటుంది జగదీశ్‌రెడ్డి అన్నారన్నారు. ఆ తర్వాత శాసనసభ 15 నిమిషాలు వాయిదా పడింది.