రాష్ట్రంలో 182 అసెంబ్లీ సీట్లు!
నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు భారీగా పెరగనున్నాయి. పార్లమెంట్ సీట్లను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో రాష్ట్రంలో ఎంపీ సీట్లు 17 నుంచి 26కు పెరుగనున్నాయి.
- డీలిమిటేషన్తో పెరుగనున్న సంఖ్య
- రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారమైతే 153
- పార్లమెంట్ స్థానాలు 17 నుంచి 26కు
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు భారీగా పెరగనున్నాయి. పార్లమెంట్ సీట్లను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో రాష్ట్రంలో ఎంపీ సీట్లు 17 నుంచి 26కు పెరుగనున్నాయి. అసెంబ్లీ సీట్లను సాధారణంగా ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ లెక్కన చూస్తే రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 182కి పెరిగే అవకాశం ఉన్నది.
పునర్విభజన చట్టంలో 153 స్థానాలే
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కు పెంచుకునే వెసులుబాటు ఉన్నది. కానీ, గత 12 ఏండ్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయలేదు. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచలేదు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లులో భాగంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తున్నది. నూతన ప్రతిపాదన ప్రకారం రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 182కి పెరిగే అవకాశం ఉన్నది. కానీ, రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపును రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం చేస్తారా? లేక నూతన చట్టం ప్రకారం చేస్తారా? అనే అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోవడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

