పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం ఈ బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం 70వ సెక్షన్‌లోని సబ్ సెక్షన్-3ని తాజాగా ప్రభుత్వం సవరించింది.
- ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిధుల జమకు చాన్స్
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం ఈ బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం 70వ సెక్షన్‌లోని సబ్ సెక్షన్-3ని తాజాగా ప్రభుత్వం సవరించింది. కొత్త సవరణ ప్రకారం గ్రామ పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని సమీపంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో జమ చేసుకునేలా చట్ట సవరణ చేశారు. ప్రస్తుతం సొంత ఆదాయాన్ని ట్రెజరీల్లోనే జమ చేస్తున్నారు. దీంతో గ్రామ అవసరాలకు ఆ నిధులను వినియోగించుకోవాలంటే ట్రెజరీ ద్వారా డ్రా చేసుకోవాల్సి వస్తున్నది.
పంచాయతీరాజ్ చట్టం – 2018 సవరణ బిల్లుకు ఆమోదం
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): శాసనమండలిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్టం -2018 సవరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. గురువారం మధ్యాహ్నం మండలి విరామం అనంతరం ప్రారంభం కాగానే మంత్రి సీతక్క ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎలాంటి సవరణలు లేకుండానే సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లు ఆమోదం పొందినట్టు ప్రకటించారు.
పసుపు నీటి శుద్ది ఘటనలో కేసు
గజ్వేల్, సెప్టెంబర్ 10: పసుపు నీటితో రోడ్లను శుద్ధి చేసిన ఘటనపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసినట్టు గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8న మర్కూక్ మండల పరిధిలోని వర్ధరాజ్‌పూర్, ఎర్రవల్లి వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమం అనంతరం కొంతమంది పసుపు నీటితో ఆయా ప్రదేశాలను శుభ్రం చేశారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మర్కూక్ స్టేషన్లో ఎర్రవల్లికి చెందిన మొండి స్వామి, వర్ధరాజ్‌పూర్‌కు చెందిన బొల్లారం శ్రీకాంత్, వర్గల్‌కు బాగనుల మోహన్ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి, విచారణ చేపట్టినట్టు సీఐ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

