మందమర్రి, సెప్టెంబర్ 10 : తెలంగాణ ఉద్యమకారుడు, సింగరేణి కార్మికోద్యమ నేత, సింగరేణి ఉద్యోగి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ అంతిమయాత్రను గురువారం ఉదయం నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ బాల్క సుమన్ మంచిర్యాల జిల్లా మందమర్రికి చేరుకుని రవీందర్ భౌతిక ఖాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పట్టణంతో పాటు నియోజక వర్గంలోని అన్ని పార్టీల నాయకులు రవీందర్ మృత దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ విప్లు బాల్క సుమన్, నల్లాల ఓదెలు డప్పు కొట్టడమే కాకుండా పాడె మోసి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు.