Fire Accident : ఎయిర్పోర్టు (Airpport) లేబర్ రూమ్ (Labour Room) లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో సిబ్బంది, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకుని పోలీసులకు, అగ్నిమాపక సిబ్బంది (Fire fighters) కి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల (Fire Engines) సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
అగ్నిమాపక సిబ్బంది రాకముందే మంటలు తక్కువగా ఉన్నప్పుడే స్థానికులు బిందెలు, బకెట్లతో నీళ్లుపోసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు మరింత ఉవ్వెత్తున ఎగిశాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడికాలేదు. మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Lucknow, Uttar Pradesh: A fire breaks out in the labor room at the Chaudhary Charan Singh International Airport. Further details are awaited. https://t.co/rJXBAyEloc
— ANI (@ANI) October 6, 2026