న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: భారత్ వద్ద 190 అణ్వాయుధాలు ఉన్నాయని అమెరికాకు చెందిన మేధో సంస్థ ‘ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్’ (ఎఫ్ఏఎస్) నివేదిక వెల్లడించింది. దాయాది దేశం పాకిస్థాన్ కంటే భారత్ వద్ద 20 అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నది. అణ్వాయుధ నిల్వల్లో భారత్ త్వర లో యూకేను కూడా అధిగమిస్తుందని అంచనా వేసింది. ఎఫ్ఏఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హన్స్ క్రిైస్టెన్సన్ రాసిన ఓ వ్యాసంలో పై అంచనాలు వెలువడ్డాయి.
దీని ప్రకారం, భారత్ తన అణ్వాయుధాల్ని యుద్ధ విమానాలు, మిస్సైల్స్, సముద్రంపై నుంచి ప్రయోగించగల క్షిపణి..ఇలా 9 వేరు వేరు వ్యవస్థల్లో మోహరించింది. మరో రెండు అణు సామర్థ్యం కలిగిన ఆయుధ వ్యవస్థల్ని అభివృద్ధి చేస్తున్నది. అణ్వాయుధాలను మొద ట ఉపయోగించకూడదనేది(నో ఫస్ట్ యూజ్) భారత్ ప్రస్తుత విధానంగా ఉంది. భారత్కు బద్ధ శత్రువుగా ఉన్న పాక్ ‘నో ఫస్ట్ యూజ్’ను పాలసీని అనుసరించటం లేదు. భారత సైనిక శక్తి తమ రక్షణ వ్యవస్థల్ని కుప్పకూల్చినప్పుడు అణు బాంబు వేయడానికి వెనుకాడబోమన్నది పాకిస్థాన్ పాలసీగా ఉంది.