Telangana Assembly | హైదరాబాద్ : రేపట్నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కానీ అసెంబ్లీ ప్రాంగణమంతా చెత్తచెదారంతో నిండిపోయింది. ముఖ్యంగా అసెంబ్లీ మీడియా పాయింట్ అధ్వాన్నంగా తయారైంది. మీడియా పాయింట్ ప్రాంగణమంతా చెత్త పేరుకుపోయింది. సీలింగ్‌కు సంబంధించిన పెచ్చులు ఊడిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా ఒక మురికి కూపంగా మారింది. రేపు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నప్పటికీ.. ఇప్పటికీ కనీస మరమ్మతులు చేయలేదు అధికారులు. ఇవాళ మీడియా పాయింట్ వద్దకు వెళ్లిన జర్నలిస్టులు.. అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు కనీస ఏర్పాట్లు చేయకపోవడం.. ప్రభుత్వానికి మీడియా పట్ల ఉన్న చిత్తశుద్ది ఏంటో అర్థమవుతుందని జర్నలిస్టులు పేర్కొన్నారు.
మెయింటెనెన్స్‌కు కూడా నోచుకోని తెలంగాణ అసెంబ్లీ
చెత్త పేరుకుపోయి, రూఫ్ పెచ్చులు ఊడిపోయిన దుస్థితిలో అసెంబ్లీ మీడియా పాయింట్
రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ కనీస మరమ్మతులు చేయని అధికారులు https://t.co/yRbF7XQp3a pic.twitter.com/1djVM33k0N
— Telugu Scribe (@TeluguScribe) August 29, 2025