Telangana | మళ్లా ఎన్నికలత్తానయ్. గారడీజేశేందుకు గుంపులన్నీ మోపైతానయ్. ఆదమర్తె గంతే సంగతి. రేపోమాపో ఓట్లడిగేందుకు గడపదగ్గరికొత్తరు. గప్పుడొక్కటే యాదికుంచుకోండ్లి.. ఏండ్ల తరబడి తెలంగాణను ఏలి ఏం ఒరగబెట్టిల్లో గాళ్లనే అడుగుండ్లి. లేదంటే గీ పదేండ్లళ్ల మనం జూశిన సంబురమేందో ఎరుకయ్యేటట్టు గాళ్ల మొఖాన్నే జెప్పుండ్లి. గంతెందుకు మనలమనమనుకుందాం. గీ తెలంగాణ రాక మునుపు మన బతుకులెట్లున్నయో మనకు దెల్వదా. ఏం కొనేటట్టు.. ఏం తినేటట్టు లేకపాయె. పనికిబోదామంటే పని కరువాయె. సరెతీ.. సొంతంగేదైన సక్కబెట్టుకుందామన్నా సిల్లిగవ్వ శేతిల లేదాయె. ఒకటా.. రొండా..?! గంటలతరబడి కరెంటు కోతల్ని మర్శిపోతమా ఏంది? కరెంటడిగితే కాల్సి సంపలే?.. ఊరియా బత్త కోసంగూడ సద్దిగట్టుకొని పొద్దంత కాళ్లుబీకంగా నిలబడ్లే?! ఇగ పిల్లకు పెండ్లి జేద్దామన్నా ఒక్కడు సాయం జేశిండా?! పొట్టతోనొచ్చిన పొల్లకు పురుడు పోశిండ్ల..?! ఎవుసం దండుగన్నది గాళ్లేనాయే! పంటలు పండకపాయె, పండిన పంటకు ధరల్లేకపాయె.. మనం గంజిదాగి మన పోరగాళ్లను సర్కారు బడుల్నొదిలి పైవేటు ఇస్కూళ్లకు తోలింది యాదికొత్తలేదా?!
గియ్యాల గీ కట్టాలేవీ మనకులేవ్.. అయినా నోరుదెర్శి అడుక్కోపోతే అవ్వైనా బువ్వ పెట్టదంటరు. గట్లాంటిదిమరి మనకిదిగావాలె అని శెప్పకున్నా, శేసుకుంటపోతాన గీ సర్కారును కాపాడుకోవాల్నా లేదా. నిమ్మలంగ గూకోని ఆలోశిత్తె మీకే దెల్తది. రైతన్నలకు రైతుబంధు, రైతుబీమా.. మన దళిత అన్నదమ్ములు, అక్కజెల్లెండ్లకు దళితబంధు.. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలచ్మి, షాదీ ముబారక్ గిట్ల శెప్పుకుంటాబోతే ఎన్నో ఉన్నయ్.. సర్కారు దవాఖానలకు కార్పొరేట్ కళదెచ్చింది.., సింగరేణికి బలం పెంచింది.., పాలమూరు వలస గోసల్నిదీర్చింది.., వరంగల్లు దశ మార్చింది.. గీ కేసీఆర్ సారేగదా!! నీళ్లుదాగితేనే కాళ్లుజేతులు వంకరబోయిన నల్లగొండకు మంచినీళ్లచ్చింది రాష్ట్రంల గిప్పుడున్న ప్రభుత్వంలనే అన్నది మరుత్తమా? సమైక్యాంధ్రోళ్ల శేతలకు మూగగ ఏడ్శిన తెలంగాణ పల్లె గిప్పుడే మురిసిపోతాందన్నది యాదుండాలె. కాళేశ్వరం కట్టతోని ఇండ్లళ్ల బిందెలు నిండె.. ఊర్లళ్ల శెర్లునిండె. ఏటికేడు శేప పిల్లలు, గొర్రె పిల్లలు ఇత్తున్నరు. శేనేతకు శేయూత, గౌడన్నలకు బాసటగ ఉంటున్నరు. గిరిజనులకు పోడు భూములిచ్చి మన ముఖ్యమంత్రి పెద్ద కొడుకైండు. అన్ని కులాలు, మతాలకు నాయం జరుగుతాంది. ధరణితోని భూముల పంచాదులన్నీ పాయె. సాగు సల్లగుంటాంది.. పల్లె పచ్చగుంటాంది.
ఇగ ఐదరబాద్ను ఇశ్వనగరంజేశి లచ్చల కోట్ల పెట్టుబడుల్ని తిస్కత్తున్నది సూత్తనే ఉన్నం. ఏల కొలువుల్ని ఇప్పిత్తున్నది కండ్లవడ్తనే ఉండె. ఉమ్మడి రాష్ట్రంల పావలా, అర్ధ బలికిన జాగలు ఇయ్యాల కోట్లకైనయ్. పాలన కోసం పది జిల్లాల్ని 30కిపైన పెంచుకున్నం. గిప్పుడు తెలంగాణ పర్యాటకంగా, పారిశ్రామికంగా, వ్యాపారపరంగా పస్టున్నది. గిది గా మోదీ సర్కారే ఒప్పుకున్నది. అయినా.. అభివృద్ధి అంటే శెప్తె ఇనబడేదిగాదు.. సూత్తె గనబడేది. కండ్లుండీ సూడలేక గుడ్డోైళ్లె గీ సర్కారు మీద గా కాంగ్రేసు, బీజేపోళ్లు దుమ్మెత్తిపోత్తాండ్లు. గాళ్లపాపం గాళ్లకే కొడ్తదిలే. మనం మాత్రం గాళ్ల కండ్లళ్ల కారంగొట్టినట్టు మళ్లా గీ బీఆర్ఎస్ సర్కారునే నిలబెట్టుకుందాం.
-అంకం సంతోష్