KTR | బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అప్రజస్వామికంగా సస్పెండ్ చేయడంతో ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్ధమయ్యారు. కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు భవిష్యత్ కార్యాచరణపై కేటీఆర్ పలు సూచనలు చేశారు. సమావేశం అనంతరం కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు రంగారెడ్డి జిల్లాలోని కొంగర, ర్యావిరాలకు బయలుదేరారు. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కంపెనీకి ఫోర్త్ సిటీలో అక్రమంగా కట్టబెట్టిన భూమిని పరిశీలించేందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొండల్ రెడ్డి కంపెనీ టెసెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌కు రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకు కట్టబెట్టింది.
కాగా, కేవలం రూ. లక్షతో మొదలైన టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రూ.200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని కేటాయించి రేవంత్ రెడ్డి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డాడని కేటీఆర్ ఆరోపించారు. టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి నేను చైర్మన్‌గా ఉన్నానని రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి లింక్డ్ఇన్ బయోలో పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి సోదరులందరికీ పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు వీళ్ళందరూ ఉన్నట్లుండి కోట్లు బూట్లు వేసుకొని పెద్ద పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎలా అయ్యారు అని ప్రశ్నించారు. ఆ కంపెనీ ఫోన్ నంబర్ 12345678 అని ఉంది.. ఇలాంటి నంబర్లు ఉండొచ్చని మాకు తెలీదు. ఈ కంపెనీలో కనీసం ఒక్క ఉద్యోగి కూడా లేడు అని కేటీఆర్ గతంలో కీలక ఆరోపణలు చేశారు. నేడు బీఆర్ఎస్ నేతలంతా కలిసి వాటి పరిశీలనకు వెళుతుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కంపెనీకి ఫోర్త్ సిటీలో అక్రమంగా కట్టబెట్టిన భూమిని పరిశీలించేందుకు బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు
కొండల్ రెడ్డి కంపెనీ టెసెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌కు రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకు కట్టబెట్టిన… https://t.co/ECQFJc4FGo pic.twitter.com/jPGxvjZD4M
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026
సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కంపెనీకి అక్రమంగా కట్టబెట్టిన భూమిని పరిశీలించేందుకు ఫోర్త్ సిటీకి చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు
కొండల్ రెడ్డి కంపెనీ టెసెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌కు రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకు కట్టబెట్టిన… https://t.co/XGhk5t8NpM pic.twitter.com/Wy5CY5uCwJ
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026