Farmers Protest : కరెంట్ కోతలకు నిరసనగా రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో రైతులు రాస్తారోకో చేస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు మెరుపు ధర్నాకు దిగారు. కేవలం 6 నుంచి 8 గంటలు మాత్రమే కరెంటు వస్తుందని, పంటలు ఎండిపోతున్నాయని రాస్తారోకో నిర్వహిస్తున్నారు. దాంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పంటలకు 24 గంటల కరెంట్ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు హెచ్చరించారు.
రాష్ట్రంలో కరెంటు కోతలు పెరిగిపోతున్నాయి. పంటలకు నీళ్లు సరిపోక ఎండిపోతుండటంతో రైతులు అల్లాడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటలు కరెంటు వచ్చేదని, అప్పడు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోయేదని గతాన్ని గుర్తుచేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పుచేశామని రైతులు పశ్చాత్తాపం వ్యక్తంచేస్తున్నారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తేనే తమ బతుకులు బాగుపడుతాయని అంటున్నారు.
రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో కరెంట్ కోతలకు నిరసనగా రైతుల రాస్తారోకో
నాగర్కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతుల మెరుపు ధర్నా
కేవలం 6 నుండి 8 గంటలు మాత్రమే వస్తుందని, పంటలు ఎండిపోతున్నాయని రాస్తారోకో, భారీగా నిలిచిపోయిన వాహనాలు
24 గంటల… pic.twitter.com/65PxFfv6WA
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026