Telangana Assembly | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ శుక్రవారం విడుదల కానుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆదివారం నామినేషన్లను స్వీకరించరు. దాఖలైన నామినేషన్లను 13వ తేదీన పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15. నవంబర్ 30న ఎన్నికల ఓటింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్లను లెక్కిస్తారు.