TG Assembly | కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రసంగించనున్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి సిద్ధమైన అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసింది. ఇవాళ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో వాడీవేడీగా అసెంబ్లీలో చర్చ జరగనుందని భావిస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు. 15వ తేదీన ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. 16వ తేదీన ఆదివారం కావడంతో అసెంబ్లీకి సెలవు. 17వ తేదీన ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత అంశంపై చర్చిస్తారు. 18వ తేదీన బీసీ కులగణన, రిజర్వేషన్లపై చర్చించనున్నారు. ఈ నెల 19వ తేదీన 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తరువాతి రోజు 20వ తేదీన అసెంబ్లీకి సెలవు. 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి.