Telangana Assembly | హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ శుక్రవారానికి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు సభ తిరిగి ప్రారంభం అవుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఇక ఇవాళ ఉదయం 11.14 గంటలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గంటా 43 నిమిషాల పాటు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించారు.
రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు. ఇక అత్యధికంగా ఎస్సీ సంక్షేమానికి రూ. 40,232 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖకు రూ. 24,439 కోట్లు, నీటి పారుదల రంగానికి రూ. 23,373 కోట్లు కేటాయించారు.