ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 18:18:24

తెలంగాణ అసెంబ్లీ సోమ‌వారానికి వాయిదా

తెలంగాణ అసెంబ్లీ సోమ‌వారానికి వాయిదా

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు సోమ‌వారానికి వాయిదా ప‌డ్డాయి. సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు స‌భ తిరిగి ప్రారంభ‌మ‌వుతుంద‌ని స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. శుక్ర‌వారం శాస‌న‌స‌భ‌లో కొత్త రెవెన్యూ బిల్లుపై సుదీర్ఘంగా చ‌ర్చించి ఆమోదించారు. 

తెలంగాణ భూమి హ‌క్కులు, ప‌ట్టాదారు పాస్‌బుక్‌ల బిల్లు-2020కు, వీఆర్వో ర‌ద్దు బిల్లుకు, తెలంగాణ గ్రామ అధికారుల ప‌ద‌వుల ర‌ద్దు బిల్లుకు, పంచాయ‌తీరాజ్ 2020 స‌వ‌ర‌ణ బిల్లుకు, పుర‌పాల‌క చ‌ట్టం 2020 స‌వ‌ర‌ణ బిల్లుకు శాస‌న‌స‌భ ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. నూత‌న రెవెన్యూ చ‌ట్టంపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ ముగిసిన అనంత‌రం ఈ బిల్లుల‌కు ఆమోదం తెలిపారు. ఈ సంద‌ర్భంగా స‌భ్యులంద‌రూ బ‌ల్ల‌లు చ‌రుస్తూ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. నూత‌న రెవెన్యూ బిల్లును ఈ నెల 9వ తేదీన స‌భ‌లో సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ బిల్లుపై శుక్ర‌వారం సుదీర్ఘంగా చ‌ర్చించారు. స‌భ్యులంద‌రూ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చారు. 


logo