హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. మూడు రోజుల విరామం అనంతరం శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిసిన అనంతరం సభకు టీ విరామం ప్రకటించారు. ఆ తర్వాత హరితహారంపై స్వల్పకాలిక చర్చను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ్యులు మాట్లాడిన అనంతరం అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వల్ప వివరణ ఇవ్వగా, ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
అనంతరం జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు, గృహ నిర్మాణ సంస్థ, ఉద్యాన వర్సిటీ చట్ట సవరణ బిల్లుకు, నల్సార్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు, టౌటింగ్ చట్టం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. పర్యాటకులు, ప్రయాణికులపై వేధింపులు, మోసాల కట్టడికి కొత్త చట్టం తీసుకువచ్చారు.