Heat Wave | దంచికొడుతున్న ఎండలు.. 12 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు.. అల్లాడిపోతున్న ప్రజలు
Heat Wave | రాష్ట్రంలో భానుడు ప్రచండ భానుడిగా మారాడు. రోహిణి కార్తె రాకముందే నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో ఉదయం 9గంటలు దాటిన తర్వాత బయటకు రావాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన ఎండలు, వడగాలుల ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు.
Heat Wave | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భానుడు ప్రచండ భానుడిగా మారాడు. రోహిణి కార్తె రాకముందే నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో ఉదయం 9గంటలు దాటిన తర్వాత బయటకు రావాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన ఎండలు, వడగాలుల ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో జనసంచారం లేక రహదారులన్నీ కర్ఫ్యూను తలపిస్తున్నది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత ప్రమాదస్థాయికి చేరినట్టు హెచ్చరించింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మెండోరాలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, 12 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని వెల్లడించింది.
2016 ఏప్రిల్ 26న మంచిర్యాల జిల్లా దండేపల్లిలో నమోదైన 48.8 డిగ్రీల తర్వాత ఈ నెలలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని పేర్కొన్నది. దీంతో ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది. వచ్చే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని వివరించింది. ప్రజలకు బయటకు వెళ్లే సమయాల్లో తగిన జాగ్రతలు తీసుకోవాలని కోరింది. ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కరిసే అవకాశం ఉన్నదని తెలిపింది.
రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ సూచనలు
ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీతో సహా 21 రాష్ట్రాలకు జాతీయ మానవ హకుల కమిషన్ పలు కీలక సూచనలు చేసింది. వృద్ధులు, గర్భిణులు, పిల్లలతోపాటు ఉపాధిహామీ కూలీలపై ఈ ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరించింది. అలాంటి వారి రక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరింది. 2019 నుంచి 2023 మధ్య కాలంలో వడదెబ్బ వల్ల 3,712 మంది మరణించినట్టు గుర్తుచేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే హీట్ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసి, బలహీనవర్గాలకు మంచినీరు, ఆశ్రయం, వైద్య సహాయం అందించాలని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

