సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : మనిషికి ప్రాణాధారమైన గాలి (ఎయిర్) స్వచ్ఛంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రతియేటా హరితహారం పేరుతో కోట్లాది మొక్కలు నాటడం.. పల్లె, పట్టణ ప్రగతితో పారిశుధ్యం మెరుగుపడడంతో రాష్ట్రవ్యాప్తంగా గాలి నాణ్యత సంతృప్తికర స్థాయిలో ఉన్నదని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక యంత్రాల ద్వారా నమోదు చేసిన గాలి నాణ్యత నివేదికను మండలి శనివారం ప్రకటించింది. ఈ ఏడాది వర్షాలు అధికంగా రావడం వల్ల గాలి నాణ్యత మరింత మెరుగ్గా ఉన్నదని తెలిపింది.
జూలైలో నమోదైన గాలి నాణ్యత
(మైక్రోగ్రామ్స్ ఫర్ క్యూబిక్ మీటర్)
ఆర్సీ పురం 71
గడ్డపోతారం 79
సంగారెడ్డి 53
నల్లగొండ 45
నల్లగొండ మార్కెట్ ఆఫీస్ 43
చౌటుప్పల్ 81
నిజామాబాద్ 46
ఆదిలాబాద్ 48
బొల్లారం 76
పీఈటీఎల్ 64
కుడా వరంగల్ 40
మీసేవ వరంగల్ 47
గోదావరిఖని 68
కరీంనగర్ 69
కొత్తగూడెం 84
ఖమ్మం 73
కొత్తూరు 80
బాలసముద్రం 47
నక్కలగుట్ట 51