నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): ఏడేండ్లుగా అభివృద్ధిలో దూ సుకుపోతూ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మతం పేరుతో బీజేపీ నేతలు విచ్ఛిన్నపు కుట్రలకు తెరలేపుతున్నారని మండలి మాజీ చైర్మ న్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. యా త్రల పేర విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంపై యావతో అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్న మతోన్మాద బీజేపీ, బ్లాక్మెయిల్ కాంగ్రెస్ నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం నల్లగొండలో గుత్తా మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజ లపై పన్నుల భారం మోపుతున్నదన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు ఎవరు కారణమో చెప్పాలని ప్రశ్నించారు. పెరుగుతున్న ధరలపై మాట్లాడకుండా, రాష్ర్టానికి రావాల్సిన వాటాగురించి ప్రస్తావించకుండా.. మత కల్లోలాలు సృష్టించడమే లక్ష్యంగా పాదయాత్ర సాగిస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్‌ది ప్రజా సంగ్రామ యాత్ర కాదని.. ప్రజాకంఠక యాత్రగా అభివర్ణించారు.
జీఎస్డీపీలో ఆరో స్థానంలో తెలంగాణ..
జీఎస్డీపీలో దేశంలోనే ఆరో అతిపెద్ద రాష్ట్రం గా తెలంగాణ నిలిచిందని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. 2014-15లో 5.05 లక్షల కోట్లున్న జీఎస్డీపీ.. 2020-21 నాటికి 94 శాతం వృద్ధి తో రూ.9.80 లక్షల కోట్లకు చేరిందని నీతి ఆయోగ్ స్పష్టం చేసిందని చెప్పారు.