కామారెడ్డి, ఆగస్టు 20: స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్సై దువ్వల ఆంజనేయులు గురువారం రూ.30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నది. అధికారుల కథనం ప్రకారం.. రాజంపేట మండలానికి చెందిన ఓ వ్యక్తి తన కుమారుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్సైని సంప్రదించగా లంచం డిమాండ్ చేశాడు.
ఈ మేరకు కామారెడ్డిలోని ఎస్సై ఆంజనేయులు నివాసంలో బాధితుడు రూ.30 వేలు లంచం ఇస్తుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.