హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలం గాణ): కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ ఇన్‌చీఫ్ భూక్యా హరిరాం ఆయన పని చేస్తున్న కార్యా లయంతోపాటు ఆయన ఇల్లు, బంధువుల ఇండ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి పలు పత్రాలను స్వాధీ నం చేసుకున్నారు.
శనివారం ఎర్రమంజిల్ జలసౌధలోని ఈఎన్సీ హరిరాం చాంబర్లో, కొత్త గూడెంలోని అతడి బంధువుల ఇండ్లల్లో, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఈఎన్సీ ఇరిగేషన్ కార్యాలయంలో, మర్కూక్ తహసీల్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్, ఇన్స్పెక్టర్ రమేశ్, వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టి.. పలు రికార్డు లను పరిశీలించారు. అనంతరం ఈఎన్సీ హరిరాం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.