హైదరాబాద్, ఫిబ్రవరి6 (నమస్తే తెలంగాణ): గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్‌గా అజయ్‌కుమార్ ప్రధాన్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు చైర్మన్‌గా పనిచేసిన ఎంకే సిన్హా సీడబ్ల్యూసీ చైర్మన్‌గా బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఏకే ప్రధాన్ నియమితుల య్యారు.
దీంతో గురువారం ఎర్రమంజిల్ జలసౌధలోని బోర్డు కార్యాలయంలో ఏ కే ప్రధాన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు మెంబర్ సెక్రటరీ అజగేషన్, ఎన్‌డబ్ల్యూడీఏ ఇంజినీర్ దేవేందర్‌రావు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.