హైదరాబాద్ : అజ్ఞాతం వీడుతున్న మావోయిస్టుల(Maoists)కు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ (Telangana P0lice Department) అండగా నిలుస్తోంది. జనజీవన స్రవంతిలో స్థిరపడేందుకు వీలుగా వారి పేరిట ఉన్న రివార్డులను అందజేస్తోంది. తద్వారా ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహించే విధంగా పోలీస్ శాఖ అడుగులు వేస్తోంది. ఇప్పటికే లొంగిపోయిన వారికి ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించి.. పునరావాస చర్యలను వేగవంతం చేసింది. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాస కార్యక్రమాలన్నింటినీ తెలంగాణ నిఘా విభాగానికి చెందిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) నేరుగా పర్యవేక్షిస్తోంది.
1980లో పీపుల్స్ వార్ (ప్రస్తుత సీపీఐ–మావోయిస్ట్) ఆవిర్భవించిన నాటి నుంచి ఎన్నడూ లేనివిధంగా గత ఏడాది ఏకంగా 576 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరికి పునరావాస ప్యాకేజీలో భాగంగా స్వగ్రామాల్లో నివాస ధ్రువపత్రాలు ఇప్పించి, ఆధార్ నమోదు చేయిస్తున్నారు. అనంతరం పాన్ కార్డు, బ్యాంకు ఖాతాలు తెరిపించి, రివార్డు సొమ్మును అదే ఖాతాల్లో జమ చేస్తున్నారు. స్థానిక రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో మాట్లాడి అవకాశం ఉన్న వారికి ఇళ్ల స్థలాల కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నారు. అనారోగ్య కారణాలతో జనజీవన స్రవంతిలోకి వచ్చిన పలువురికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చేయించారు.
A major blow to banned CPI #Maoists in #Bastar.
PLGA chief Barsa Deva (aka Barsa Sukka), surrenders to TG DGP Shivadhar Reddy. He along with 20 other red rebels surrender with 48 LMGs/ 20L cash.
Deva a close aide of #Hidma was behind the killing of 121 security personnel pic.twitter.com/Nbz4Dc8Kfy
— Media5Zone News (@media5zone) January 3, 2026
“పోరు వద్దు – ఊరు ముద్దు. అజ్ఞాతం వీడి జనంలోకి రండి. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పునరావాసం కల్పిస్తాం” అని మిగిలిన మావోయిస్టులకు రాష్ట్ర పోలీస్ శాఖ సూచించింది. తెలంగాణ నుంచి మావోయిస్ట్ పార్టీలో చేరి.. ఆపై అజ్ఞాతంలోకి వెళ్లి ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మావోయిస్టు క్యాడర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి .
జన జీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులకు చిరునామా వచ్చింది. ప్రభుత్వం, పోలీస్ శాఖ ఇచ్చిన మాట ప్రకారం వారికి పునరావాస చర్యలు వేగవంతం అయ్యాయి. “పోరు వద్దు- ఊరు ముద్దు” అంటూ మిగిలిన మావోయిస్టులు కూడా వనం వీడి జనంలోకి రండి.#DGPTelangana pic.twitter.com/Zz1tQFM1Qz
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) January 20, 2026
1. ముప్పాళ్ల లక్ష్మణ్ రావు @ గణపతి – కేంద్ర కమిటీ సభ్యుడు (CCM & PBM), రివార్డు రూ.25 లక్షలు.
2. తిప్పిరి తిరుపతి @ దేవ్జీ – CCM, PBM & జనరల్ సెక్రటరీ, రివార్డు రూ.25 లక్షలు.
3. మల్లా రాజి రెడ్డి @ సంగ్రామ్ – కేంద్ర కమిటీ సభ్యుడు, రివార్డు రూ.25 లక్షలు.
4. పుసునూరి నరహరి @ సంతోష్ – CCM, ఈఆర్బీ సభ్యుడు (జార్ఖండ్లో కార్యకలాపాలు), రివార్డు రూ.20 లక్షలు.
5. ముప్పిడి సాంబయ్య @ సుదర్శన్ – రాష్ట్ర కమిటీ సభ్యుడు, డివిజనల్ కార్యదర్శి, రివార్డు రూ.20 లక్షలు.
6. వార్తా శేఖర్ @ మంగ్తు – డీకేఎస్జెడ్సీ సభ్యుడు, కమ్యూనికేషన్ వింగ్ ఇన్చార్జి, రివార్డు రూ.20 లక్షలు.
ఇప్పటికే సమయం మించిపోయింది, మిగతా మావోయిస్ట్ సభ్యులు కూడా బయటికి వచ్చి లొంగిపోవాల్సింగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ నుండి అప్పీల్ చేస్తున్నాం.#DGPTelangana pic.twitter.com/OJFfsnWwm2
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) January 3, 2026
7. జోడే రత్నబాయి @ సుజాత – CCM, డీకేఎస్జెడ్సీ ఇన్చార్జి, రివార్డు రూ.20 లక్షలు.
8. లోకేటి చందర్ రావు @ ప్రభాకర్ – వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి, రివార్డు రూ.20 లక్షలు.
9. బడే చొక్కారావు @ దామోదర్ – రాష్ట్ర కమిటీ సభ్యుడు, సైనిక వ్యవహారాల ఇన్చార్జి, రివార్డు రూ.20 లక్షలు.
10. నక్కా సుశీల @ రేలా, డీసీఎం స్థాయి కేడర్ రివార్డ్ 5 లక్షలు
11. జాడి పుష్ప @ రాజేశ్వరి – డీసీఎం స్థాయి కేడర్లు, రివార్డు రూ.5 లక్షలు చొప్పున
12. రంగబోయిన భాగ్య @ రూపి, ఏరియా కమిటీ స్థాయి క్యాడర్ రివార్డు 4. లక్షలు.
13. బాదిషా ఉంగ @ మంతు ఏరియా కమిటీ స్థాయి కేడర్ రివార్డు నాలుగు లక్షలు
14. మడివి అడుమె @ సంగీత, ఏరియా కమిటీ స్థాయి కేడర్ రివార్డు 4 లక్షలు.
15. కాశపోగు భవాని @ సుగుణ ఏరియా కమిటీ స్థాయి క్యాడర్ రివార్డు 4 లక్షలు.
16. కుంజం ఇడమల్ – ఏరియా కమిటీ స్థాయి కేడర్లు, రివార్డు రూ.4 లక్షలు చొప్పున.
17. ఉతిమి అనిల్ కుమార్ @ భగత్ సింగ్ – పార్టీ సభ్యుడు, కంప్యూటర్ ఆపరేటర్, రివార్డు రూ.1 లక్ష.