శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 13:00:17

జాయింట్ రిజిస్ర్టార్లుగా త‌హ‌సీల్దార్లు : సీఎం కేసీఆర్

జాయింట్ రిజిస్ర్టార్లుగా త‌హ‌సీల్దార్లు : సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : కొత్త రెవెన్యూ చ‌ట్టం ప్ర‌కారం ఇక నుంచి త‌హ‌సీల్దార్లే జాయింట్ రిజిస్ర్టార్లుగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. త‌హ‌సీల్దార్ల‌కు వ్య‌వ‌సాయ భూములే రిజిస్ర్టేష‌న్ చేసే అధికారం ఉంటుంది అని సీఎం పేర్కొన్నారు. రిజిస్ర్టార్ కార్యాల‌యంలో వ్య‌వ‌సాయేత‌ర భూముల రిజిస్ర్టేష‌న్లు జ‌రుగుతాయ‌న్నారు. గ్రామ‌కంఠం, ప‌ట్ట‌ణ భూముల‌ను వ్య‌వసాయేత‌ర భూములుగా ప‌రిగ‌ణిస్తామ‌న్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో పంచాయ‌తీ, పురపాలిక‌, న‌గ‌ర‌పాలిక‌, జీహెచ్ఎంసీ ఆస్తుల వివ‌రాలు ఉంటాయ‌న్నారు. ఎవ‌రు ఎక్క‌డున్నా ఉన్న చోట నుంచే ఆస్తుల వివ‌రాలు చూసుకోవ‌చ్చు. రిజిస్ర్టేష‌న్ ప్ర‌క్రియ ముందే అలాట్ చేయాలి. అలాట్ చేసిన వివ‌రాలు వెబ్‌సైట్‌లో న‌మోదు చేయాలి. రిజిస్ర్టేష‌న్ కోసం ముందే ప్ర‌జ‌లు స్లాట్ అలాట్‌మెంట్ కోరాలి. విద్యావంతులైతే డాక్యుమెంట్లు వాళ్లే రాసుకోవ‌చ్చు. కావాలంటే ఫీజు చెల్లించి డాక్యుమెంట్ రైట‌ర్ సాయం తీసుకోవ‌చ్చు. క్రయ విక్ర‌యాల రిజిస్ర్టేష‌న్ చేసిన వెంట‌నే పోర్ట‌ల్‌లో అప్‌డేట్ అవుతాయి. రిజిస్ర్టేష‌న్‌, మ్యుటేష‌న్ స‌హా అన్ని సేవ‌లు ఏక‌కాలంలో పూర్తి అవుతాయ‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 


logo