శంకరపట్నం, డిసెంబర్ 28: నాలా మార్పిడి కోసం ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల నాయబ్ తహసీల్దార్ ఇండ్రాల మల్లేశం శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఎరడపల్లికి చెందిన కలకుంట్ల నవీన్‌రావు నాలా కన్వర్షన్ కోసం ఈ నెల 10న రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. పని కావాలంటే రూ.10 వేల ఖర్చు అవుతుందని నాయబ్ తహసీల్దార్ లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు బాధితుడు శనివారం కార్యాలయంలో మల్లేశంకు రూ.6 వేలు అందజేస్తుండగా అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.