హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 11 ( నమస్తే తెలంగాణ ) : శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం సాయంత్రం టేకాఫ్ అయిన UK-880 విస్తారా విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో పైలట్ 20 నిమిషాలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టాడు. సాంకేతికలోపంతో అప్రమత్తమైన పైలట్ తిరిగి శంషాబాద్లోనే విమానా న్ని ల్యాండ్ చేశాడు. ఫ్లైట్‌లో 180 మంది ప్రయాణికులు ఉన్నారని, మెయింటనెన్స్ కారణంగానే అత్యవసర ల్యాండ్ అయినట్టు విస్తారా యాజమాన్యం ప్రకటించింది. ప్రయాణికులను వేరే ఫ్లైట్‌లో ఢిల్లీకి తరలించారు.