హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ఉపాధిహామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న పాలిటెక్నిక్ డిప్లొమా అర్హత కల్గిన వారిని వ్యవసాయశాఖలో విలీనం చేయాలని మాజీ శాసనసభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. మంగళవారం గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు చాడ వెంకటరెడ్డిని కలిసి తమ సమస్యలపై మొరపెట్టుకున్నారు.
ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖలు రాశారు. గ్రామీణ ఉపాధిహామీ పథకంలో రాత, మౌఖిక పరీక్షల తర్వాత జిల్లా కలెక్టర్ల ద్వారా టెక్నికల్ అసిస్టెంట్స్‌గా నియమితులయ్యారని తెలిపారు. రైతుల సమస్యలను పరిషరించడానికి వీరు ఎల్లవేళలా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వీరందరూ గ్రామీణ ఉపాధిహామి పథకంలో ఉన్నందున, రైతులకు సలహాలు, సూచనలు చేయలేకపోతున్నారని లేఖలో వివరించారు.