దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం ‘ఐయామ్ గేమ్’ ట్రైలర్‌ను అగ్ర హీరో ఎన్టీఆర్ లాంచ్ చేశారు. ఈ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రానికి నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో డాన్ జాన్ అనే అండర్ వరల్డ్ డాన్‌లా కనిపించనున్నారు దుల్కర్ సల్మాన్.
సీట్ఎడ్జ్ థ్రిల్లర్ చిత్రమిదని, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని, యాక్షన్, విజువల్స్ అబ్బురపరుస్తాయని మేకర్స్ తెలిపారు. దాదాపు 100కుపైగా లొకేషన్లలో ఈ సినిమా చిత్రీకరణ జరిపామని, ఇందులో అల్ట్రా ైస్టెలిష్ డాన్‌గా దుల్కర్ సల్మాన్ పాత్ర హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు తెలిపారు. కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్నందిస్తున్నారు.