ఖలీల్వాడి, ఏప్రిల్ 22 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంద్రాపూర్ ప్రాంతంలో అతికించిన బీఆర్ఎస్ రజతోవ్సవ సభ పోస్టర్లను కొందరు దుండగులు చించేశారు. బీఎర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో పార్టీకార్యకర్తలు పోస్టర్లు అతికించారు. సోమవారం రాత్రి కొందరు వాటిని చించుతుండగా, గుర్తించిన బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. చించిన పోస్టర్లను తిరిగి వారితోనే అంటింపజేశారు.