జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్రంలో ఉపాధ్యాయలు(Teachers) పోరుబాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని రోడ్డెక్కారు. తాజాగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం భూపాలపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్మాగ్రహ దీక్ష (Dharmagraha Deeksha) చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ములకల్ల తిరుపతి మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలైన నాలుగు డీఏలు, పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు.
అలాగే పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, 317 జి. ఓ బాధిత ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరిం చాలని, సీసీఎస్‌ను అంతం చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నవంబర్ 23న హైదరాబాద్‌లో ఇందిరాపార్క్ వద్ద రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వస్తామన్నారు. దీక్ష అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఇవి కూడా చదవండి..
Inter Exam Fee | ఇంటర్ ఎగ్జామ్ ఫీజు తేదీలు వచ్చేశాయ్..
Noel Tata | టాటా సన్స్‌లోకి అడుగుపెట్టిన నోయల్ టాటా.. అధికారికంగా ప్రకటించిన బోర్డు