హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ దినోత్సవం రోజే గురుకుల ప్రిన్సిపాళ్లకు కాంగ్రెస్ సర్కారు షాక్ ఇచ్చింది. అడ్మిషన్లు తగ్గడంపై రాష్ట్రవ్యాప్తంగా 170 మంది మైనార్టీ గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరితోపాటు పలువురు గురుకుల కాలేజీల ప్రిన్సిపాళ్లకూ నోటీసులు జారీ అయ్యాయి. సర్కారు చర్యలపై మైనార్టీ గురుకుల ప్రిన్సిపాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదెక్కడి న్యాయమంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. కొంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇష్టారీతిన తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగానే మైనార్టీ గురుకులాల్లో అడ్మిషన్లు తగ్గుతున్నాయని చెబుతున్నారు.